
||ప||
ఎంత వరకు ఎందు కొరకు ఇంత పరుగు అని అడక్కు
గమనమే నీ గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకు
ప్రశ్నలోనే బదులు ఉంది గుర్తుపట్టే గుండెనడుగు
ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాక ఆ నిజం తెలుసుకోవా
తెలిస్తే ప్రతీ చోట నిన్ను నువ్వే కలుసుకుని పలకరించుకోవా
|| ఎంత వరకు ఎందు కొరకు ||
.
||చ||
కనపడేవెన్నెన్ని కెరటాలు కలగలిపి సముద్రమంటారు
అడగరే ఒక్కొక్క అల పేరు మనకిలా ఎదురైన ప్రతివారు
మనిషనే సంద్రాన కెరటాలు పలకరే మనిషి అంటే ఎవరూ
సరిగా చూస్తున్నదా నీ మది, మదిలో నువ్వే కదా ఉన్నది
చుట్టూ అద్దాలలో విడి విడి రూపాలు నువ్వు కాదంటున్నది
నీ ఊపిరిలో లేదా గాలి వెలుతురు నీ చూపుల్లో లేదా
మన్ను మిన్ను నీరు అన్నీ కలిపితే నువ్వే కాదా కాదా…
|| ప్రపంచం నీలో ||
.
||చ|||
మనసులో నీవైన భావాలే బయట కనిపిస్తాయి దృశ్యాలై
నీడలు నిజాల సాక్ష్యాలే శతృవులు నీలోని లోపాలే
స్నేహితులు నీకున్న ఇష్టాలే ఋతువులు నీ భావ చిత్రాలే..
ఎదురైన మందహాసం నీలోని చెలిమి కోసం
మోసం,రోషం,ద్వేషం నీ మకిలి మతికి భాష్యం
పుటక చావు రెండే రెండు నీకవి సొంతం కావు పోనీ..
జీవితకాలం నీదే నేస్తం రంగులు ఏం వేస్తావో కానీ…
No comments:
Post a Comment