Showing posts with label Gamyam. Show all posts
Showing posts with label Gamyam. Show all posts

Friday, July 10, 2009

చాల్లేగాని ఏంటా పరాకు


చాల్లేగాని ఏంటా పరాకు
ఉన్నట్టుండి ఏమైంది నీకు
అయ్యో రాణి మరి ఇదైపోకు
tell me అని enquiryలన్నీ ఎందుకు

మాతోనే తిరుగుతుంటూ మా ఊసే పట్టనట్టు
ఏదోలా ఎందుకున్నావ్ నీదీ లోకం కాదన్నట్టు

ఒదిగుందే లోని గుట్టు కదిలిస్తే తేనెపట్టు
వదలదుగా వెంట పడుతూ నాకేం తెలుసిది ఇంతేనంటూ

దూకేదాక లోతన్నది కొలిచే వీలు ఏమున్నది
పరువలేదు అంటున్నది ప్రేమలొ పడ్డది

ఆమె చెంపలా కందిపోవటం
ఏమి చెప్పటం ఎంత అద్భుతం
అందుకే కదా కోరి కోరి కయ్యాలు

అతనికోసమే ఎదురు చూడటం
బ్రతిమలాడి తను అలక తీర్చటం
పూట పూట ఎన్నెన్ని చిలిపి కలహాలు

జంటలెన్ని చెబుతున్నా
ఎన్ని కధలు వింటున్నా
అంతుబట్టదీ ప్రేమ ఏనాటికైనా

విన్నాగాని అంటావేగాని ఏమంటుంది ఆకాశవాణి
చూసాగాని వేరే లోకాన్నిఏం చెప్పాలి చూపించే వీలు లేదని

పక్కకెళ్ళిపో పాడు మౌనమా
కరగవెందుకే కొద్ది దూరమా
పక్కకెళ్ళిపో పాడు మౌనమా
కరగవెందుకే కొద్ది దూరమా
బైటపడని జత ఏదో చూసుకోరాదా

ఎంతసేపు ఈ వింత dilemma
కధని కాస్త కదిలించు కాలమా
నువ్వే రాక ఈ debate ఎంతకి తెగదా

కొత్త దారిలో నడక ఇప్పుడిప్పుడే కనుక
తప్పదేమో తడబడక అలవాటు లేక

ఇన్నాళ్ళుగా ఉన్నాగా నేను
నువ్వొచ్చాక ఏమయిపోయాను

నీతో నేను అడుగేస్తున్నాను
ఏవైపంటే ఏమో ఎలాగ చెప్పను