Showing posts with label Roja. Show all posts
Showing posts with label Roja. Show all posts

Tuesday, July 14, 2009

నా చెలి రోజావే నాలో ఉన్నావే



నా చెలి రోజావే నాలో ఉన్నావే
నిన్నే తలిచేనే నేడే

నా చెలి రోజావే నాలో ఉన్నావే
నిన్నే తలిచేనే నేడే
కళ్ళల్లో నీవే కన్నీటా నీవే
కనుమూస్తే నీవే ఎదలోనిండేవే
కనిపించవో అందించవో తోడు

నా చెలి

గాలి నన్ను తాకినా నిన్ను తాకు జ్ఞాపకం
గులాబీలు పూసినా చిలిపి నవ్వు జ్ఞాపకం
అలలు పొంగి పారితే చెలియ పలుకు జ్ఞాపకం
మేఘమాల సాగితే మోహ కధలు జ్ఞాపకం

మనసులేకపోతె మనిషి ఎందుకంట
నీవులేకపోతె బతుకు దండగంట
కనిపించవో అందించవో తోడు

నా చెలి

చెలియ చెంత లేదులె చల్లగాలి ఆగిపో
మమత దూరమాయెనె చందమామ దాగిపో
కురుల సిరులు లేవులే పూలవనం వాడిపో
తోడులేదు గగనమా చుక్కలాగ రాలిపో

మనసులోని మాట ఆలకించలేవా
వీడిపోని నీడై నిన్ను చేరనీవా
కనిపించవో అందించవో తోడు

నా చెలి