Showing posts with label he for she. Show all posts

Friday, July 10, 2009

ఏ చిలిపి కళ్ళలోన కలవో ఏ చిగురు గుండెలోన లయవో

నువ్వు అచ్చుల్లోన హల్లువో జడకుచ్చుల్లోన మల్లెవో

కరిమబ్బుల్లోన విల్లువో మధుమాసంలోన మంచు పూల జల్లువో
మధుమాసంలోన మంచు పూల జల్లువో

ఏ చిలిపి కళ్ళలోన కలవో ఏ చిగురు గుండెలోన లయవో

ఈ పరిమళము నీదేనా నాలో పరవశము నిజమేనా
బొండుమల్లెపువ్వు కన్న తేలుకగు నీ సోకు
రెండు కళ్ళు మూసుకున్న లాగు మరి నీ వైపు
సొగసును చూసి పాడగా ఎలా కనులకు మాట రాదుగా హలా

వింతల్లోన కొత్త వింత నువ్వేనాఆ అందం అంటే అచ్చంగా నువ్వే

ఏ చిలిపి కళ్ళలోన కలవో ఏ చిగురు గుండెలోన లయవో

ఆ పలుకులలో పరవళ్ళు తూలే కులుకులలో కొడవల్లు
నిన్ను చూసి వంగుతుంది ఆశపడి ఆకాశం
ఆ మబ్బుచీర పంపుతుంది మోజు పడి నీకోసం
స్వరముల తీపి కోయిల ఇలా పరుగులు తీయకే అల అలా

నవ్వుతున్న నిన్ను చూసి సంతోషం నీ బుగ్గ సొట్టలోనే పాడే సంగీతం

ఏ చిలిపి కళ్ళలోన కలవో ఏ చిగురు గుండెలోన లయవో
నువ్వు అచ్చుల్లోన హల్లువో జడకుచ్చుల్లోన మల్లెవో
నువ్వు అచ్చుల్లోన హల్లువో జడకుచ్చుల్లోన మల్లెవో
కరిమబ్బుల్లోన విల్లువో మధుమాసంలోన మంచు పూల జల్లువో
మధుమాసంలోన మంచు పూల జల్లువో....