Showing posts with label nireekshana. Show all posts
Showing posts with label nireekshana. Show all posts

Friday, July 10, 2009

యమున ఎందుకే నువ్వు ఇంత నలుపెక్కినావు


హొయి రేరీరే హొయ్యారెహొయి
యమున తీరే హొయ్యారెహొయి

యమున ఎందుకే నువ్వు ఇంత నలుపెక్కినావు
రేయి కిట్టయతోటి కూడావా

యమున ఎందుకే నువ్వు ఇంత నలుపెక్కినావు
రేయి కిట్టయతోటి కూడావా

నల్లా నల్లని వాడు నిన్ను కవ్వించెనా
వలపు సయ్యాటలోన నలుపు నీకంటెనా

హొయి రేరీరే హొయ్యారెహొయి
యమున తీరే హొయ్యారెహొయి

వెన్నంటి వెంటాడి వస్తాడే ముచ్చు
కన్నట్టి గీటేసి పెడతాడే చిచ్చు

వెన్నంటి వెంటాడి వస్తాడే ముచ్చు
కన్నట్టి గీటేసి పెడతాడే చిచ్చు

చల్లమ్మబోతుంటే చెంగట్తుకుంటాడే

చల్లమ్మబోతుంటే చెంగట్తుకుంటాడే
దారివ్వకే చుట్టూ తారాడతాడే
పిల్ల పోనివ్వనంటు చల్లా తాగెస్తడే
అల్లా రల్లడి వాడు అబ్బో ఏం పిల్లడే

హొయి రేరీరే హొయ్యారెహొయి
యమున తీరే హొయ్యారెహొయి

సిగిపించ మౌలన్న పేరున్నవాడే
శృంగార రంగాన కడతేరినాడే

సిగిపించ మౌలన్న పేరున్నవాడే
శృంగార రంగాన కడతేరినాడే

రేపల్లెలోకెల్ల రూపైన మొనగాడే

రేపల్లెలోకెల్ల రూపైన మొనగాడే
ఈ రాధకీడైన జతగాడు వాడే
మురళి లోలుడు వాడే ముద్దు గోపాలుడే
వలపే దోచేసినాడే చిలిపి శ్రీ క్రిష్ణుడు

హొయి రేరీరే హొయ్యారెహొయి
యమున తీరే హొయ్యారెహొయి

యమున ఎందుకే నువ్వు ఇంత నలుపెక్కినావు
రేయి కిట్టయతోటి కూడావా

నల్లా నల్లని వాడు నిన్ను కవ్వించెనా
వలపు సయ్యాటలోన నలుపు నీకంటెనా

హొయి రేరీరే హొయ్యారెహొయి
యమున తీరే హొయ్యారెహొయి