Showing posts with label kondaveeti donga. Show all posts
Showing posts with label kondaveeti donga. Show all posts

Friday, July 17, 2009

శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో




శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో
అది నీకు పంపుకున్న అపుడే కలలో
పుష్యమి పూవుల పూజ చేస్తా బుగ్గన చుక్కలతో
ఒతిడి వలపుల గంధమిస్తా పక్కలలో

శుభలేఖ అందుకున్న కలయో నిజమో
తొలి ముద్దు జాబు రాసా చెలికే ఎపుడో
శారద మల్లెల పూల జల్లే వెన్నెల నవ్వులలో
శ్రావణ సంధ్యను రంగరిస్తా కన్నులతో

సుభ లేఖ రాసుక్కున్న ఎదలో ఎపుడో
తొలి ముద్దు జాబు రాసా చెలికే ఎపుడో

చైత్రమాసమోచ్చేనేమో చిత్రమైన ప్రేమకి
కోయిలమ్మ కూసెనేమో గొంతునిచి కొమ్మకి
మత్తుగాలి వీచెనేమో మాయదారి చూపుకి
మల్లెమబ్బులాదేనేమో బాల నీలవేనికి
మెచ్చి మెచ్చి చూడసగే గుచే కన్నులు
గుచ్చి గుచ్చి కౌగిలించే నచ్చే వన్నెలు
అంతేలే కధంతేలే అదంతేలే ........

శుభలేఖ అందుకున్న కలయో నిజమో
తొలి ముద్దు జాబు రాసా చెలికే ఎపుడో
పుష్యమి పూవుల పూజ చేస్తా బుగ్గన చుక్కలతో
ఒతిడి వలపుల గంధమిస్తా పక్కలలో
శుభలేఖ అందుకున్న కలయో నిజమో
శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో

హంసలేఖ పంపలేక హింసపడ్డ ప్రేమకి
ప్రేమలేఖ రాసుకున్న పెదవి రాని మాటకు
రాధా లాగ మూగబోయా పొన్న చెట్టు నీడలో
వేసవల్లె వీచిఉన్న వేగుపూల తోటలో
వాలు చూపు మోసుకోచే ఎన్నో వార్తలు
వొళ్ళో దాటి వెళ్ళసాగే ఎన్నో వాంఛలు
అంతేలే కధంతేలే అదంతేలే

శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో
అది నీకు పంపుకున్న అపుడే కలలో

sశారద మల్లెల పూల జల్లే వెన్నెల నవ్వులలో
శ్రావణ సంధ్యను రంగరిస్తా కన్నులతో

శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో
శుభలేఖ అందుకున్న కలయో నిజమో